సియాచిన్ లోని
భారత సైనిక శిబిరంపై మంచు తుపాను దెబ్బతో మాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు
నుండి 800 మీటర్ల వెడల్పు
ఉన్న మంచు పలక వచ్చి పడడంతో 9 మంది సైనికులు అక్కడికక్కడనే ప్రాణాలు కోల్పోగా … కాగా 6 రోజులపాటు 25 అడుగుల లోతున
మంచులో కూరుకుపోయిన ప్రాణాలతో ఉండి వైద్యనిపుణులను సైతం ముంచెత్తిన లాన్స్ నాయక్
హనుమంతప్ప (33) ఆర్మీ ఆస్పత్రికి మెరుగైన వైద్యం అందించినా, అప్పటికే ఆరోగ్య
పరిస్థితి విషమంగా మారి మృత్యువుతో పోరాడుతూ వీర మరణం పొందారు. కర్ణాటకలోని
థార్వాడ్‌కు చెందిన హనుమంతప్పకు భార్య, ఏడాదిన్నర పాప
ఉంది. భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు.
దేశవ్యాప్తంగా
హనుమంతప్ప కోలుకోవాలని దేశ ప్రజలు ఆకాంక్షినా, మరో ప్రక్క
వైద్యులు శ్రమించినా ఫలితం దక్కలేదు. హనుమంతప్పకు కళ్ళను, కిడ్నీ ని దానం
ఇచ్చేందుకు పలువురు ముందుకు వచ్చినా చివరికి మృత్యువే జయించింది.
♦ అన్నిరోజులు ఎలా బ్రతకగలిగాడు ?
సైనికులు ఏమాత్రం
తప్పించుకునే వీలు లేకుండా క్షణకాలంలో విరుచుకు పడిన మంచు తుపాన్ లో పది మంది
సైనికులు మరణించారనుకొని, మృత దేహాలకై వెదికే సహాయక చర్యల్లో … హనుమంతప్ప 6 రోజుల పాటు 25 అడుగుల క్రిందట ‘ -50 డిగ్రీల ‘ మంచులో బ్రతికి
ఉండడంతో ఆర్మీ బృందం అవాక్కయ్యింది. ఆర్మీ వైద్య అధికారులు మాత్రం హనుమంతప్ప శరీర
సామర్థ్యంతో పాటు, అతని అధిక ఇమ్మ్యూనిటీ పవర్ కలిగి ఉండి ఉండడంతో పాటు, గాలి ప్రవేశించే
వీలున్న ప్రదేశంలో పడి ఉండవచ్చన్న వాదన వినిపిస్తున్నారు. అంతేగాక హనుమంతప్ప
తనకున్న ప్రతికూల వాతావరణాన్ని అధిగమించేందుకు తాను కూరుకుపోయినప్పటినుండి
ముఖాన్ని మంచు కప్పబడకుండా తొలగించుకుంటూ, తన చుట్టూ గాలి
తగిలే వాతావరణాన్ని ఏర్పరచుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. హనుమంతప్ప వేసుకున్న
దుస్తులు శరీరంలో ఉన్న వేడిని బయటకు పోకుండా కొంతవరకు కాపాడినా, మరోప్రక్క శరీరంలో
వేడిని అలాగే నిలుపుకునేందుకు మూత్ర విసర్జన కూడా అదుపు చేసుకుంటూ ఎక్కువుగా
చేయకపోవడం కూడా అన్ని రోజుల పాటు బ్రతికి ఉండడం సాధ్యం అయ్యిందనే సూత్రీకరణ
చేస్తున్నారు.
మరొక రకమైన
అధ్భుతం ఏమంటే – తిండి లేకుండా అలాంటి ప్రతికూల వాతావరణంలో 6 రోజులు ప్రాణాలు
నిలబెట్టుకున్నా … హనుమంతప్పను వెలికి తీసే సమయానికి స్పృహలోనే ఉండడం ఆశ్చర్య పరిచింది.
హనుమంతప్ప నిజమైన సైనిక స్పూర్తిని కొనియాడాలంటే మాటలు సరిపోవు.
భారత మాత ఉప్పొంగేలా ప్రజలంతా ముక్త కంఠంతో
ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ‘ జై భారత్ ‘ అని
గట్టిగా నినాదం ఇస్తేనే వీర మరణం పొందిన హనుమంతప్పకు నిజమైన శ్రద్ధాంజలి !

0 comments:
Post a Comment