Wednesday, 16 September 2015


నోటు,మద్యం నుండి ఓటును రక్షిద్దాం
                                గౌరవ ఓటర్లుందరికి క్రియోటర్స్ స్వచ్ఛంద సంస్థ పక్షాన అభినందనలు, ఎందుకనగా మీరంత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి, సుధీర్ఘ పోరాటాల ద్వారా సాదించిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మరియు స్థానిక సభ్యులను ఎన్నుకోనుటకు ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఇంతటి క్రీయాశీలకమైన సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్దులకు ఓటరు ఒక దేవుడిగా గుర్తుకొస్తాడు. ఈ కీలక సమయంలో నోటుతో ఓటును కొనుటకు ప్రలోభపెట్టవచ్చును అలాగే వ్యక్తుల వ్యసన బలహినతల ద్వారా మభ్యపెట్టవచ్చును.

        నోటుకు ఓటరు బలహీనతగా మారి అభ్యర్ధికి ఓటు బలంగా మారి గ్రామ అభివృద్ధి, దేశ అభివృద్దికి ఆటంకం ఏర్పడును.గత 60 సం; ల నుండి దేశంలో ఎన్నో ఎన్నికలు రావడం ప్రభుత్వాలు మారడం తిరిగి కొత్త ప్రభుత్వాలు రావడం మీరంత గమనిస్తున్నారు. కాని గ్రామాల అభివృద్ధి ఎక్కడేసిన గొంగిడి అక్కడే మదిరిగానే నిలిచిపోయింది. ఇంకా గ్రామాలల్లో నిరక్షరాశ్యత , విద్యుత్ , నీరు, ఊపాధి , రోడ్లు, వసతులు మొదలైన అనేక సమస్యలు ఉన్నాయీ. దీనికి కారణం ఎవరు ? ప్రతి సం;ము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెడుతున్నది అనేక కొత్త పతకాలు, సంస్కరణాలు చేస్తున్నది ఇవేవి గ్రామ అభివృద్దికి తోడ్పడటం లేదు. దీనికి కారణం ఎవరు.? ఒక్క నిమిషం  ఆలోచిస్తే ప్రతి ఒక్కరు చెప్పే సమాదానం ఫలానా పార్టి ప్రభుత్వం అవినితిది  ఆ అభ్యర్ధి అవినీతి పరుడు అని చాల బాగా చెబుతాం కానీ ఈ అవినీతి పరులకు తాళాలు ఇచ్చి దోచుకోమ్మంటున్నది మాత్రం నోటుకు ఓటు అమ్ముకునే ఓటర్లే  ఇలా ఇంకా ఓటును నోటుకు అమ్ముకుంటున్నారంటే  మన ప్రజలు ఎంత పేద రికంలో ఉన్నరో ఆలోచించండి, ఒక పేద వాడి ఆకలిని( ఓటును ) నోటుతో కొని గెలిచినా వాడు దోచుకుంటాను,తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుంది  తాను ఖర్చు చేసిన ప్రతి పైసాను వడ్డీ, చక్ర వడ్డీలతో సహా తిరిగి ఆ ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల నుండి వసూళ్ళు చేస్తారు. మీ ఓటును ఆయుదంగా మార్చిఅవినీతి రహితులు , ఉత్సాహవంతులు , అభివృద్ధి కాముకులు, చైతన్యవంతమైన అభ్యర్ధులను ఎన్నుకోవడానికి మాత్రమే ఉపయోగించండి .నోటు, మద్యం ఇచ్చే అభ్యర్దులను (NOTA)  అభ్యర్ధి నచ్చలేదు. అనే గుర్తు ద్వారా తిరస్కరించి తెలివైన ఓటరుగా చైతన్యాన్ని చూపండి.

               గ్రామాల స్వపరిపాలనే దేశ  స్వపరిపాలన , గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు అన్న మహాత్మ గాంధీ మాటలను నిజం చేసే అవకాశం మనందరికీ ఓటు ద్వారా లభించింది . మనందరం ఓటు హక్కును సద్వినియోగం చేసుకొందాం , గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుదాం.

  సదా గ్రామ అభివృద్దిని దాని ద్వారా  దేశ అభివృద్దిని కాక్షించే మీ క్రియేటర్స్ స్వచ్చంద సoస్థ (+91 9533107818).

0 comments:

Post a Comment