Thursday, 17 September 2015


స్వైన్ ఫ్లూ లక్షణాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

            దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు ఉండడం స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ ఫ్లూ అనడానికి వీలులేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే స్థానిక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

ఇలా వ్యాపిస్తుంది:
            వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, తుంపర్ల ద్వారా వెలువడే వైరస్ చుట్టు పక్కలకు వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులతో భుజించినా, కలిసి నడిచినా, కరచాలనం చేసినా, నిద్రించినా, ఆలింగనం చేసుకున్నా ఈ వ్యాధి సోకుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదు.
2. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మూతికి మాస్క్, బట్ట ధరించాలి.
3. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి.
4. 
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వారికి వ్యాధి వేగంగా సోకే అవకాశముంటుంది.
5. మధుమేహం, క్యాన్సర్, వృద్ధులు, పిల్లలు, గర్బిణులకు, శ్వాసకు సంబంధించి వ్యాధి ఉన్న వారికి, ైస్టెరాయిడ్స్ వాడే వారికి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశముంది.

చికిత్స ఇలా:
1. స్వైన్ ఫ్లూ టీకా తాత్కాలికమైంది. అవసరాన్ని బట్టి వైద్యుల సలహాల మేరకు తీసుకోవాలి. టీకా, మందులు వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
2. ఐసొలేషన్ తప్పని సరిగా ఉండాలి.
3. ఇతర రోగులు ఆ వార్డులో లేకుండా చూడాలి.
4. ఆక్సిజన్‌తో పాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు ఇవ్వాలి.
5. సాధారణ మహిళలతో పోలిస్తే గర్బిణులకు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుంది.
6. గర్భంలో పిండం పెరగడం కారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది.
7. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షల కోసం శ్యాంపిల్స్‌ను తీసి పంపించాలి.
8. వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించేవారు ఎస్-95 మాస్క్‌లు వాడాలి.

మీ
క్రియేటర్స్ స్వచ్చంద సంస్థ.
Creators Voluntary Organization.
# 8-47/1, పెద్ద వంగర, కొడకండ్ల, వరంగల్,
తెలంగాణ రాష్ట్రం – 506 317. ఫోన్ నెం: +91 9533107818.
Email:creatorsvoluntaryorganisation@gmail.com

0 comments:

Post a Comment