రక్తదాతలు ప్రాణదాతలు:-
అత్యవసర పరిస్థితుల్లో రక్తము కావలిసిన వారికి ఆరోగ్యవంతులు యిచ్చె రక్తదానం
వెలలేని కానుక తోటి మానవులు మీద ప్రేమతో, తనదైన రక్తము మరొకరితో పంచుకోవలెనన్న
తపనతో రక్తదానము చేయువారు మానవులలో మహానీయులు ఆసుపత్రికి వచ్చే 10మంది రోగులలో
ఒకరికి రక్తమెక్కoచవలిసిన ఆవశ్యాకత ఉoటుoది ప్రాణదారమెన రక్తము సమయానికి సమకూరక
పోతే రోగి ప్రాణాలు కోలోపయే ప్రమాదముంది.
రక్తము ఎవరికి అవసరం:-
ప్రమాదాల వల్ల గాని, జబ్బులవల్ల గాని రక్తము కోల్పోయిన వారికీ, క్లిష్టమైన
ఆపరేషన్లకు, గుండె జబ్బులకు, క్యాన్యర్ లాంటి వ్యాధులకు, HIV / AIDS వ్యాదిగ్రస్తులకు
రక్తము అవసరం.
రక్తదానము ఎవరైనా చేయవచ్చా......?
18-60 సంవత్సరముల మధ్య వయసున్న ఆరోగ్యవంతుడైన ప్రతి వ్యక్తీ రక్తము దానము
చేయవచ్చు, రక్తదాత ఆరోగ్యము గురుంచి వైద్యులు అన్ని పరీక్షలు జరిపాకే రక్త సేకరణ
జరుగుతుంది.
ప్రతి ఆరోగ్యవంతులైన వ్యక్తీ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానము ఇవ్వవచ్చును.
రక్తదానము చేస్తే శరిరమునకేమి కాదా....?
ప్రతి మానవుని శరీరంలో 5-6 లీటర్ల రక్తముంటుంది. ప్రతిసారి 350 మి. లీటర్ల
రక్తము దానము చేయవచ్చు. రక్తదానము చేసినా , చేయకపోయినా ప్రతి రోజు ఈ మాత్రము
రక్తము ఖర్చు అవుతుంది.దానము చేసిన రక్తమును వెంటనే మన శరీరంలోని నిల్వల నుంచి సమకూర్చు కుంటుంది.
24 గంటల నుంచి 76 గంటలలోగా రక్త ప్రసారణ పుర్తిస్తాయికి చేరుకుంటుంది. దీని వలన రోగ నిరోధక శక్తి
తగ్గదు. అందువలన సంవత్సరానికి 4 సార్లు నిస్సంకోచంగా రక్తదానము
ఇవ్వవచ్చును.
రక్తదానము వల్ల నీరసము గాని, అలసట గాని వుండవు. రక్తదానము చేసిన వెంటనే
మామూలు కార్యక్రమాలు చేయవచ్చు.
రక్తాన్ని ఉత్పత్తి చేసే శక్తి సామర్ద్యము మన దేహానికి మాత్రమే ఉన్నాయి.
అందుకే అది చాలా అపురుపమైనది. దానిని దానం చేయటం “మహాదానం” గా గుర్తింపు
పొందింది.
మీరు, మీ కుటుంబ సభ్యులు, స్న్హేహితులు,
సహచేరులoదరూ రక్తదానము చేయండి, ప్రానదాతలుగా అపాయంలోనున్న ప్రాణాన్ని కాపాడండి. ప్రాణదాతలు
అవండి గుర్తింపు పొందండి.
“ధన్యవదములు”
You’s
CREATORS VOLUNTARY ORGANIZATION
# 8-46/1, మెయిన్ రోడ్, పెద్దవంగర , కొడకండ్ల , వరంగల్ , 506317.
|
Home
»
»Unlabelled
» రక్తదానము చేయండి ప్రాణదాతలు అవండి
Thursday, 17 September 2015
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment