Thursday, 17 September 2015



ప్లాస్టిక్ జాతీయ జెండాలు

ప్లాస్టిక్, పాలిథిన్ పదార్దాలతో తయారుచేసిన వస్తువులు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణానికి ఇవి హాని కలుగజేస్తాయని తెలిసినా నియంత్రణ చర్యలు చేపటడంలేదు . ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్లాస్టిక్ జెండాలు అత్యధికంగా దర్శనమిచ్చాయి! ప్లాస్టిక్ జెండాలు ఎంతగా విస్తరించిందనడానికి ఇది నిదర్శనం. అలంకరణ కోసం కడుతున్న పతాకాలు తోరణాలు సైతం ఆ తరవాత చేత్తాచేదారంగా పోగువుతున్నాయి. రోజుల తరబడి జెండాలు తొలగించకపోవడంవల్ల అవి  ముక్కలు ముక్కలుగా చినిగి నేలపాలవుతున్నాయి. వేడుకల తరవాత జాతీయ జెండాలను అంతే గౌరవంతో తొలగించాలి! ఇప్పటికైన అధికారులు, ఉపాధ్యాయులు, బాద్యతగల పౌరులు చొరవతిసుకుని జాతీయ జెండా గౌరవాన్ని విలబెడుతూ శిధిలమవుతున్న వాటిని తొలగించాలి. భవిష్యత్తులో కాగితం లేదా వస్త్రాలతో చేసిన జెండాలనే అందరు విధిగా వినియోగించేలా విధి నిషేధాలు అమలు చేయాలి.

0 comments:

Post a Comment